నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామధర్నాలో పాల్గొన్న ఖానాపురం బీఆర్ఎస్ నాయకులు – లాఠీచార్జ్, అరెస్టులతో ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం కూల్చివేత ఘటనపై ఖానాపురంమండలంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విగ్రహం కూల్చివేతకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగామారడంతోపోలీసులుఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ధర్నా సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైపోలీసులులాఠీలుప్రయోగించినట్లు నాయకులు ఆరోపించారు. అలాగే ఆందోళనలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండించిన ఖానాపురం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
