Wednesday, 3 June 2026
  • Home  
  • పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: కాకర్ల నాగార్జున నాయుడు
- తిరుపతి

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: కాకర్ల నాగార్జున నాయుడు

ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో చిట్వేల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిట్వేల్‌కు చెందిన మద్దిన ప్రమీలమ్మ, కస్తూరివారిపల్లికి చెందిన కస్తూరి మునీశ్వర్, రెడ్డివారిపల్లికి చెందిన బుంగటావుల రాధమ్మ, గోసల ఇందిరమ్మ, తుమ్మచెట్లపల్లికి చెందిన తుంగా శ్రీదేవిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇన్‌చార్జ్ వెంకటేష్ రాజు, టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, యూనిట్ ఇన్‌చార్జ్ బండారు శివ, బూత్ ఇన్‌చార్జ్ మద్దిన కోటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుంగా చిన్న సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నాయకులు పేర్కొన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో చిట్వేల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిట్వేల్‌కు చెందిన మద్దిన ప్రమీలమ్మ, కస్తూరివారిపల్లికి చెందిన కస్తూరి మునీశ్వర్, రెడ్డివారిపల్లికి చెందిన బుంగటావుల రాధమ్మ, గోసల ఇందిరమ్మ, తుమ్మచెట్లపల్లికి చెందిన తుంగా శ్రీదేవిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇన్‌చార్జ్ వెంకటేష్ రాజు, టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, యూనిట్ ఇన్‌చార్జ్ బండారు శివ, బూత్ ఇన్‌చార్జ్ మద్దిన కోటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుంగా చిన్న సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.