Sunday, 26 April 2026
  • Home  
  • పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి-మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ
- తిరుపతి

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి-మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : తిరుపతి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ.. అనుభవజ్ఞురాలైన పనబాక లక్ష్మి నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర కీలకమని, కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.