శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తిలోని శ్రీ విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ కుమారస్వామి ఆడికృత్తిక మహోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ధార్మిక కార్యక్రమాల గోడపత్రికను శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పరిధిలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడికృత్తిక మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పవిత్రమైన ఈ మహోత్సవాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కుమారస్వామి వారి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. మహోత్సవాల విజయవంత నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులు, ఆడికృత్తిక మహోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆడికృత్తిక మహోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి