Sunday, 26 April 2026
  • Home  
  • నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి కోలా ఆనంద్ నివాళి
- తిరుపతి

నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి కోలా ఆనంద్ నివాళి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి న్యూస్( : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన భాస్కర్ రావు భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి కోలా ఆనంద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, వారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో భాస్కర్ రావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.