శ్రీ కాళహస్తి, జులై 05 : (పున్నమి న్యూస్) : నిండ్ర మండలం కొప్పెడు ఎస్టీ కాలనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు మాసారపు సుబ్బయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని గిరిజనులు తమ సమస్యలపై ఆయనకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తమ కాలనీలో పాఠశాల లేకపోవడం వల్ల సుమారు 25 మంది గిరిజన విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. పిల్లలు ప్రతిరోజూ ప్రమాదకరమైన చెరువు కట్ట కింద నుంచే నడిచి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ కట్ట విరిగి ఎక్కడ పిల్లలపై పడుతుందోననే భయంతో చాలామంది పిల్లలను బడికి పంపించడం లేదని సుబ్బయ్యకు వివరించారు. వెంటనే తమ కాలనీలోనే ఒక పాఠశాల భవనాన్ని నిర్మించాలని వారు కోరారు. గిరిజనుల విజ్ఞప్తిపై మాసారపు సుబ్బయ్య సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కాలనీలోనే నూతన పాఠశాల భవనం మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. గిరిజన పిల్లల చదువుకు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గిరిజన కాలనీలో పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేస్తా-మాసారపు సుబ్బయ్య