వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విజయవాడలో స్కూల్ మరియు కాలేజీ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో బస్సుల పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి, డ్రైవింగ్ లైసెన్సులు కూడా తనిఖీ చేస్తున్నారు.
బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చేర్పించే ముందు బస్సుల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు.


