Friday, 4 September 2026
  • Home  
  • *పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఎంపికైన తుమ్మలచెరువు ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా*
- పల్నాడు

*పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఎంపికైన తుమ్మలచెరువు ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా*

పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఫిరోజ్ బాషా 2026 సంవత్సరానికి గాను పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5, 2026 శనివారం ఉదయం 9.00 గంటలకు నరసరావుపేట, ప్రకాష్ నగర్ లోని భువన చంద్ర టౌన్ హాల్ లో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేయనున్న విద్యుత్ శాఖామాత్యులు మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ డా॥ కృతికా శుక్లా, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి.వి.జె.రామారావు తదితర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరాయంగా సేవలందిస్తున్న ఫిరోజ్ బాషా, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లోని వెనుకబాటుతనాన్ని పోగొట్టి, వారి తెలుగు మరియు ఇంగ్లీష్ చేతివ్రాతను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం 45 నిమిషాల పాటు అదనపు తరగతులు తీసుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వేసవి సెలవుల్లో రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి స్థానిక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అడ్మిషన్లు సాధించారు. ఆయన అంకితభావం మరియు వినూత్న బోధనా పద్ధతులను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నవంబర్ 2025 లో సోషల్ మీడియా వేదికగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. విద్యా రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను గత ఏడాది డిసెంబర్లో నాట్స్ (NATS) వారి నుండి కూడా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.

పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఫిరోజ్ బాషా 2026 సంవత్సరానికి గాను పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 5, 2026 శనివారం ఉదయం 9.00 గంటలకు నరసరావుపేట, ప్రకాష్ నగర్ లోని భువన చంద్ర టౌన్ హాల్ లో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేయనున్న విద్యుత్ శాఖామాత్యులు మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ డా॥ కృతికా శుక్లా, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి.వి.జె.రామారావు తదితర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరాయంగా సేవలందిస్తున్న ఫిరోజ్ బాషా, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లోని వెనుకబాటుతనాన్ని పోగొట్టి, వారి తెలుగు మరియు ఇంగ్లీష్ చేతివ్రాతను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం 45 నిమిషాల పాటు అదనపు తరగతులు తీసుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వేసవి సెలవుల్లో రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి స్థానిక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అడ్మిషన్లు సాధించారు.
ఆయన అంకితభావం మరియు వినూత్న బోధనా పద్ధతులను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నవంబర్ 2025 లో సోషల్ మీడియా వేదికగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యా రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను గత ఏడాది డిసెంబర్లో నాట్స్ (NATS) వారి నుండి కూడా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.