నెల్లూరు: ఆ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు!
జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ విడాకుల కేసులో దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. బీటెక్ చదువుతున్న భవిత నాయుడు, వీర నాయుడికి వివాహం కాగా, మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తులు ఇరువురి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. దంపతులకు నచ్చజెప్పి, కుటుంబ విలువలు, భవిష్యత్ జీవితం గురించి వివరించారు. ఇరువురి మధ్య రాజీ కుదరడంతో వారు కలిసి జీవించేందుకు అంగీకరించారు. అనంతరం న్యాయమూర్తుల సమక్షంలో దండలు మార్చించి, దంపతులను తిరిగి కలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు కూడా దంపతులను అభినందించారు. లోక్‌అదాలత్ ద్వారా కేసు సానుకూలంగా పరిష్కారమైంది.


