ఫిట్స్‌తో వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం ముంబై జాతీయ రహదారి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి ఫిట్స్‌తో కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకుని వ్యక్తిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు బుచ్చి ఎస్‌ఐ ఉమాశంకర్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించకపోవడంతో పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యక్తి ఎవరనేది తెలిసిన వారు వెంటనే బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


