Tuesday, 15 September 2026
  • Home  
  • క్రేజీ కిడ్స్ విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- BHADRADRI

క్రేజీ కిడ్స్ విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పాల్వంచ: పాల్వంచకు చెందిన ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ “క్రేజీ కిడ్స్ సక్సెస్ మీట్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అదనపు కమాండెంట్ పి. కోటేశ్వరరావు హాజరై కరాటే పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మాట్లాడుతూ, తమ అకాడమీ విద్యార్థులు టైకా కరాటే టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరాటే క్రీడ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో టైకా కరాటే టోర్నమెంట్ విజేతలు, వారి తల్లిదండ్రులు, ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సభ్యులు, కరాటే శిక్షకులు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పాల్వంచ: పాల్వంచకు చెందిన ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ “క్రేజీ కిడ్స్ సక్సెస్ మీట్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అదనపు కమాండెంట్ పి. కోటేశ్వరరావు హాజరై కరాటే పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మాట్లాడుతూ, తమ అకాడమీ విద్యార్థులు టైకా కరాటే టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కరాటే క్రీడ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.
కార్యక్రమంలో టైకా కరాటే టోర్నమెంట్ విజేతలు, వారి తల్లిదండ్రులు, ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సభ్యులు, కరాటే శిక్షకులు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.