నెల్లూరు DEOపై మంత్రి నారా లోకేశ్ అసహనం
నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ఎం పాఠశాలను మంత్రి నారా లోకేశ్ నిన్న ప్రారంభించారు. అనంతరం పాఠశాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో కేవలం 61 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీగా విద్యార్థులు ఫెయిల్ కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి (DEO) బాలాజీరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. ప్రసాద్ పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు, పాఠశాల ఎన్రోల్మెంట్ తగ్గుదలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.


