Monday, 29 June 2026
  • Home  
  • నెల్లటూరులో ఘనంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లటూరులో ఘనంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 29 (పున్నమి ప్రతినిధి) గూడూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. “నిండుజీవితానికి 2 చుక్కలు” నినాదంతో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బూత్ కోఆర్డినేటర్లు టి. శాలీష్ (సీహెచ్‌వో), ఐ. శశిదేవి (ఏఎన్‌ఎం) పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ ప్రతి చిన్నారికి ప్రతి సారి పోలియో మోతాదు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది సేవలను గ్రామస్థులు అభినందించి, రాష్ట్ర ఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 29 (పున్నమి ప్రతినిధి)
గూడూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. “నిండుజీవితానికి 2 చుక్కలు” నినాదంతో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బూత్ కోఆర్డినేటర్లు టి. శాలీష్ (సీహెచ్‌వో), ఐ. శశిదేవి (ఏఎన్‌ఎం) పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ ప్రతి చిన్నారికి ప్రతి సారి పోలియో మోతాదు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది సేవలను గ్రామస్థులు అభినందించి, రాష్ట్ర ఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.