రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐఏఎస్ గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాణ్యం నియోజకవర్గ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, సనాతని దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వధువు ప్రత్యూష, వరుడు భరత్‌లను వారు ఆశీర్వదించి, వారి నూతన జీవితం సుఖసంతోషాలతో, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.


