
పట్టబద్రుల ఎమ్మెల్సీ బరిలో శరత్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా ఓయూ విద్యార్థి నాయకుడు త్వరలో జరగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది.ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శరత్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడబోతున్నారు, శరత్ నాయక్ గత 13 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలలో కీలక భూమిక పోషించారు. టిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపిపై నిరుద్యోగులు, ఉద్యోగులలో ఉన్న అసంతృప్తులు ఓటర్లు శరత్ నాయక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోర్ర శరత్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్ ),M.Li.Sc, ఎంఎ (లింగ్విస్టిక్స్),ప్రస్తుతం ఎల్.ఎల్.బి చదువుతున్నారు, ఇదే క్రమంలో దశాబ్దానికి పైగా ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై తనవంతు గలం బలంగా వినిపించడం జరిగింది,సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన కోసం, గిరిజన రిజర్వేషన్ 10% పెంపు కోసం,అదేవిధంగా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం,ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో వారి హక్కుల సాధన కోసం,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాజ్యాంగబరమైన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు, ఎన్నో కేసులు ఎదురైనా ఎక్కడ వెనుతిరగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో కూడా నిరుద్యోగుల కోసం,రావలసిన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం,విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు, రానున్న పట్టబద్రుల ఎన్నికలలో విద్యార్థి, నిరుద్యోగ,ఉద్యోగుల సమస్యలు తెలిసినవాడిగా, సుబ్బండవర్గాల అభ్యర్థిగా, నిరంతరం ప్రశ్నించే గొంతుకగా తనను శాసనమండలికి పంపిస్తే వారి సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తున్నారు.

