Sunday, 16 August 2026
  • Home  
  • వాజ్‌పేయి సేవలు దేశానికి చిరస్మరణీయం పుణ్యతిథి సందర్భంగా సదైవ్ అటల్‌లో నివాళులర్పించిన మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పువరపు వెంకయ్య నాయుడు
- ఖమ్మం

వాజ్‌పేయి సేవలు దేశానికి చిరస్మరణీయం పుణ్యతిథి సందర్భంగా సదైవ్ అటల్‌లో నివాళులర్పించిన మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పువరపు వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి, మహనీయుడు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పుణ్యతిథి సందర్భంగా సదైవ్ అటల్, విజయ్ ఘాట్‌లో భారత్ మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి గారిని తన గురువుగా, మార్గదర్శిగా స్మరించుకుంటూ భక్తిపూర్వకంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు. అటల్‌జీ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప రాజనీతిజ్ఞుడు, మానవతావాది అని కొనియాడారు. భారతదేశానికి ఆయన అందించిన సేవలు, దేశాభివృద్ధిపై ఆయనకు ఉన్న దూరదృష్టి చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారత రత్నగా గౌరవించబడిన వాజ్‌పేయి ఆలోచనలు, ఆదర్శాలు భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. దేశం పట్ల ఆయన చూపిన నిబద్ధత, ప్రజాసేవలో ఆయన పాటించిన విలువలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొంటూ ఆయనకు గౌరవపూర్వక నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.