దుత్తలూరు: మండలంలోని తురకపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లకు చెట్టు కొమ్మలు తగులుతూ ప్రమాదకరంగా మారాయి. ఇళ్లకు సమీపంలో విద్యుత్ తీగలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గాలులు వీచిన సమయంలో చెట్టు కొమ్మలు వైర్లకు తగలడంతో విద్యుత్ అంతరాయం, షార్ట్‌సర్క్యూట్ జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారులు, వృద్ధులు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి, విద్యుత్ వైర్లను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.



