Wednesday, 19 August 2026
  • Home  
  • తాళ్లరేవు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాళ్లరేవు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాళ్లరేవు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిగొంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలపల్లి పాఠశాలల్లో సోషల్ సబ్జెక్టు బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మండల విద్యాశాఖాధికారులు ఏ మంగాయ్యమ్మ మరియు ఎం ఉమా ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుంకరపాలెంలో గణితం బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ వరకు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు.ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన, నిర్దేశిత కాలపరిమితి 01.09.206 నుండి 30.04.2027 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని, నెలకు రూ.12,000/- గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఎంఈఓలు తెలిపారు. కావున, ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి దరఖాస్తు వివరాలు తెలుసుకుని, నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ఎంఈఓలు కోరారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాళ్లరేవు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిగొంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలపల్లి పాఠశాలల్లో సోషల్ సబ్జెక్టు బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మండల విద్యాశాఖాధికారులు ఏ మంగాయ్యమ్మ మరియు ఎం ఉమా ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుంకరపాలెంలో గణితం బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ వరకు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు.ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన, నిర్దేశిత కాలపరిమితి 01.09.206 నుండి 30.04.2027 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని, నెలకు రూ.12,000/- గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఎంఈఓలు తెలిపారు.
కావున, ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి దరఖాస్తు వివరాలు తెలుసుకుని, నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ఎంఈఓలు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.