భారతదేశంలో డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలకు ప్రధాన కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో గుజరాత్ ప్రభుత్వం తొలి డేటా సెంటర్ పాలసీ (2026–29)ను ప్రకటించింది. ఈ విధానం ద్వారా ₹6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 7.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిదారులకు మూలధన సబ్సిడీ, వడ్డీ రాయితీలు, విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ వంటి అనేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ విధానం ద్వారా గుజరాత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక రాష్ట్రంగా అవతరిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

డేటా సెంటర్ల హబ్‌గా గుజరాత్.. ₹6 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం