మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని జలదంకి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల కన్వీనర్ ఇస్కా మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవరపల్లి రఘురామరెడ్డి, సూరే శేషారెడ్డి, వాకా మాధవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, జగదీష్, పేతురు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి