ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 22 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొండూరు సత్రం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొనడంతో పదిమంది గాయపడ్డారు. వెంకటగిరి నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో వెంకటాచలం, వెంకటగిరి, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కాళహస్తికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై శివ రాకేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పదిమందికి గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొనడంతో పదిమంది గాయపడ్డారు. వెంకటగిరి నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో వెంకటాచలం, వెంకటగిరి, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కాళహస్తికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై శివ రాకేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

