ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని అరుంధతి వాడ అంబేద్కర్ నగర్‌లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వంద రోజుల పాటు టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఆశా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా రోగులను గుర్తించి మొబైల్ వాహనాల సహాయంతో ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

టీబీ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు