అరకులోయ నియోజకవర్గంలోని పెదలబుడు, పద్మాపురం, అనంతగిరి మండలం వాలసి పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. టీడీపీ లో పలువురు వైసీపీ నాయకులు చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. చేరినట్లు ప్రచారం జరుగుతున్న వారికి వైసీపీతో సంబంధం లేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీకి ప్రజాదరణ కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలతో దానిని తగ్గించలేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో 90 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను మానుకోవాలని కోరారు.

టీడీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి : అరకు ఎమ్మెల్యే రేగం