మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మధురవాడ జోన్ పరిధిలోని 6,7,8 వార్డులలో పలు ప్రాంతాలకు ఆగస్టు 20, 2026 (గురువారం) తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ మంచినీటి సరఫరా మెయింటెనెన్స్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీవీఎంసీ మధురవాడ జోన్లో త్రాగు నీటిని సరఫరా చేసే గోస్తని నది జలాలను పంపింగు చేయు 700 యం.యం. వ్యాసార్థము కలిగిన ప్రధాన పైపులైన్ మధురవాడ పాత పెప్సీ కంపెనీ వద్ద మరమ్మత్తులకు గురైనందున దానిని మరమ్మతులు చేయుటకు గోస్తని హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 370 HP మోటార్ ద్వారా త్రాగు నీటిని పంపు చేయడం ఆపివేయడం జరిగిందని, కావున వార్డు నెం.6 పరిధిలో రిక్షా కాలనీ, వైభవ్ నగర్, రేవళ్ళపాలెం, బక్కన్న పాలెం, పీఎం పాలెం, లక్ష్మీ వానిపాలెం, అశోక్ నగర్, పీఎం పాలెం- LIC’s, MIG’s,R.H. కాలనీ, K1,K2,K3,M1 హౌసింగ్ కాలనీ మరియు అమరావతి కాలనీ, వార్డు నెంబర్.7 పరిధిలో NGO’s కాలనీ, మిధిలాపురి వుడా కాలనీ పార్ట్ మరియు వార్డు నెంబర్. 8 పరిధిలో షిప్ యార్డ్ లేఅవుట్ తదితర ప్రాంతాలలో త్రాగునీటికి అంతరాయం ఏర్పడుతుందన్నారు.
తాగునీటి సరఫరాలో కలిగే అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ తరఫున ఆయన కోరారు. అత్యవసర ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేపట్టడం జరుగుతుందని, నీటి ట్యాంకర్ ద్వారా నీరు కావలసిన పురప్రజలు మధురవాడ జోన్ నీటి సరఫరా సహాయక ఇంజనీర్లులను సంప్రదించగలరని, వార్డ్ నెంబర్ 6 ఇంచార్జ్ సహాయకి ఇంజనీరు 8297652049, వార్డ్ నెంబర్ 7 ఇంచార్జ్ సహాయకి ఇంజనీరు 9603152887, వార్డ్ నెంబర్ 8 ఇంచార్జ్ సహాయకి ఇంజనీరు 9908477519 లను సంప్రదించాలని మంచినీటి విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు తెలియజేశారు.

