నర్సాపురంలో కరపత్రాల పంపిణీ – చింత పురుషోత్తం పిలుపు
కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రకటించింది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా నర్సాపురం గ్రామంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింత పురుషోత్తం పాల్గొని కరపత్రాలు పంపిణీ చేస్తూ 22వ తేదీ జరుగు ధర్నాను విజయవంతం చేయాలని చేనేత కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చింత పురుషోత్తం మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేనేతకు తగిన ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సదుపాయాలు, రుణ సదుపాయాలు కల్పించాలని కోరారు. 22వ తేదీ ధర్నాలో ప్రతి చేనేత కార్మికుడు పాల్గొని తమ గొంతు వినిపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు మామిళ్ళ రంగస్వామి, చింతా రఘు, తలారి లక్ష్మయ్య, తలారి ఆంజనేయులు, దేవనారాయణ, గంగరాజు, భార్గవ, చౌడయ్య, నారాయణస్వామి, రామాంజి, శివ, తదితరులు, గుత్తి సునీలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని జిల్లాల చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని సంఘం నాయకులు కోరారు.


