Wednesday, 15 April 2026
  • Home  
  • గోపాలకృష్ణారెడ్డి జన్మదినం.. తొట్టంబేడులో సేవా కార్యక్రమాల వెల్లువ
- తిరుపతి

గోపాలకృష్ణారెడ్డి జన్మదినం.. తొట్టంబేడులో సేవా కార్యక్రమాల వెల్లువ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడులో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 78వ జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రమణ్యం, తంగేళ్లపాలెం సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తొట్టంబేడు పంచాయతీ చంద్రబాబు నాయుడు ఎస్టీ కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. గోపాలకృష్ణారెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పథాన్ని ఆయన తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమర్థంగా కొనసాగిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దశరథచారి, గాలి చలపతి నాయుడు, గాలి మురళి నాయుడు, మిన్నల్ రవి, ఉమేష్ రావు, కిషోర్, సుబ్బయ్య, కోట చంద్రశేఖర్, బి. వెంకటేశ్వర్లు, హరి, హేమభూషణ్, భూపాల్, చందు, కృష్ణయ్య, భార్గవ్ కుమార్, బాలాజీ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.