హెలిపాడ్ నుంచి ఆర్.కె. నగర్‌కు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గమధ్యలో గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వద్ద ఆగి ఆధునిక సదుపాయాలతో సిద్ధం చేసిన అంబులెన్సులను ప్రారంభించారు.
గన్నెల పంచాయతీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసిన ఈ ఆరోగ్య రథాలు అత్యవసర వైద్య సేవల్లో కీలకంగా ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో రోగులను త్వరగా ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు ఎంతో దోహదపడనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబులెన్సులను ప్రారంభించిన అనంతరం వాటి ద్వారా అందించనున్న వైద్య సేవలు, సదుపాయాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.



