ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతినిధి )
ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి సీపీఐ ఆధ్వర్యంలో భారీ ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు. ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు బహిరంగ సభను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్‌రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


