Thursday, 13 August 2026
  • Home  
  • వికలాంగ కుటుంబానికి రెండోసారి అండగా డాక్టర్ ప్రణీత్
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వికలాంగ కుటుంబానికి రెండోసారి అండగా డాక్టర్ ప్రణీత్

రూ.5 వేల ఆర్థిక సాయం మర్రిపాడు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): మండలంలోని ఇర్లపాడు గ్రామానికి చెందిన పుట్టుకతోనే వికలాంగుడైన రవిచంద్ర కుటుంబానికి డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ మరోసారి అండగా నిలిచారు. డాక్టర్ వింజం దొరసనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గతంలో రవిచంద్ర కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన ఆయన, తాజాగా రెండోసారి ఆర్థిక సహాయం అందించారు.కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ రూ.5,000లను ఫోన్‌పే ద్వారా రవిచంద్రకు పంపించారు. ఈ మొత్తంతో కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే ఒకసారి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచిన డాక్టర్ ప్రణీత్, మరోసారి ఆర్థిక సహాయం చేయడంపై రవిచంద్ర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న డాక్టర్ ప్రణీత్ సేవాభావాన్ని పలువురు అభినందించారు.

రూ.5 వేల ఆర్థిక సాయం

మర్రిపాడు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): మండలంలోని ఇర్లపాడు గ్రామానికి చెందిన పుట్టుకతోనే వికలాంగుడైన రవిచంద్ర కుటుంబానికి డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ మరోసారి అండగా నిలిచారు. డాక్టర్ వింజం దొరసనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గతంలో రవిచంద్ర కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన ఆయన, తాజాగా రెండోసారి ఆర్థిక సహాయం అందించారు.కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ రూ.5,000లను ఫోన్‌పే ద్వారా రవిచంద్రకు పంపించారు. ఈ మొత్తంతో కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే ఒకసారి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచిన డాక్టర్ ప్రణీత్, మరోసారి ఆర్థిక సహాయం చేయడంపై రవిచంద్ర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న డాక్టర్ ప్రణీత్ సేవాభావాన్ని పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.