భీముని పాదం పరిసరాల్లో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం మరియు జలపాతం అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు సందర్శించేందుకు ఇది మంచి సమయం. అయితే జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
గ్రామీణ వాతావరణంలో ప్రకృతి నడుమ పాలధారల జాలువారే జలపాతం వద్దకు పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన పర్యాటకులు. కుటుంబ సభ్యులతో పాటు సేద తీరుతున్నారు.



