చిట్వేలు: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రైల్వేకోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేలు ఎస్సై ఎస్. వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రాజుకుంట గ్రామంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్‌కాల్స్, సందేశాలు, లింక్‌లకు స్పందించవద్దని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటి నివారణకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని, గ్రామంలో అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మహిళా భద్రతపై పోలీసుల అవగాహన