Thursday, 13 August 2026
  • Home  
  • ఖమ్మం అభివృద్ధికి ఢిల్లీలో ఎంపీ రఘురాం రెడ్డి వరుస విజ్ఞప్తులు
- ఖమ్మం

ఖమ్మం అభివృద్ధికి ఢిల్లీలో ఎంపీ రఘురాం రెడ్డి వరుస విజ్ఞప్తులు

ఖమ్మం ఆగష్టు 13 (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి అవసరమైన ప్రాజెక్టుల కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు సమర్పించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ‘పీఎం-సేతు’ హబ్ కేటాయించాలని కోరారు. ఖమ్మం ఐటీఐని హబ్‌గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను స్పోక్స్‌గా అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో మిరప, ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ-మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏరోస్పేస్ కారిడార్‌గా ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఏరోస్పేస్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కారిడార్‌కు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతినిధి)

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి అవసరమైన ప్రాజెక్టుల కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు సమర్పించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ‘పీఎం-సేతు’ హబ్ కేటాయించాలని కోరారు. ఖమ్మం ఐటీఐని హబ్‌గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను స్పోక్స్‌గా అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో మిరప, ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ-మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి హైదరాబాద్–బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏరోస్పేస్ కారిడార్‌గా ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఏరోస్పేస్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కారిడార్‌కు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.