భద్రాద్రి కొత్తగూడెం:- (పున్నమి న్యూస్) 13/08/2026 రామవరం కాలువలు తవ్వగా వచ్చిన ఎర్రమట్టిని రోడ్డుకు ఒకవైపు పెద్ద కుప్పగా వేశారు.రోడ్డులో ఎక్కువ భాగం మట్టి మరియు గోయ్యి ఆక్రమించడం వల్ల ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది.ప్రమాదాల ముప్పు: కాల్వ చుట్టూ ఎలాంటి రక్షణ హెచ్చరిక బోర్డులు (Barricades) లేదా రేడియం టేపులు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వర్షం వస్తే మరింత సమస్య: వర్షం పడితే ఈ ఎర్రమట్టి అంతా బురదగా మారి వాహనాలు దిగబడిపోయే ప్రమాదం ఉంది.



