ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి, పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ప్రకటించారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగ సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపించేందుకు జనసేన సిద్ధమవుతోందని తెలిపారు. గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వంతో పట్టభద్రుల్లో పార్టీకి మరింత ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టభద్రులు జనసేన అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించాలని రామ్ తాల్లూరి కోరారు. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.



