Thursday, 9 July 2026
  • Home  
  • కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం*
- News

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం*

*🚍కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం* *🚍మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసరా ప్రాంతంలోనే బస్సు పాసుల జారీ* *🚍ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రత్యేక బస్ పాస్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి* *🚍జిల్లాల విభజనతో కోట బస్టాండ్ నెల్లూరు జిల్లాకు, వాకాడు డిపో తిరుపతి జిల్లాకు మారడం వల్లే ఈ నిర్ణయం* *🚍విద్యార్థులు, ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో పరిసర బస్సు పాస్ కౌంటర్ కి వెళ్లి పాసులు పొందాలి* *———————* *✍🏽మునిరాజ్ 👇🏽* *జర్నలిస్ట్* *———————-* కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన విద్యార్థులు, సీజన్ పాస్ దారులకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కీలక సమాచారం అందించారు. ఈ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రయాణికులు ఇకపై బస్సు పాసుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే పాసుల జారీ ప్రక్రియను చేపట్టనున్నట్లు వాకాడు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ పాస్ కేంద్రం వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, పాస్ దారులు నేరుగా అక్కడికి చేరుకుని తమ పాసులను పొందవచ్చని వారు కోరారు. *🚍జిల్లాల పునర్విభజన కారణం: వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు* ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా ఆర్టీసీ డిపోల పరిధిలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా కోట ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్లడంతో పాటు, గూడూరు డిపో పరిధిలో విలీనమైంది. మరోవైపు, వాకాడు డిపో తిరుపతి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. పరిపాలనాపరమైన ఈ మార్పుల దృష్ట్యా, తిరుపతి జిల్లా పరిధిలోని ప్రజల సౌకర్యార్థం బస్సు పాస్ కౌంటర్‌ను వాకాడు డిపో పరిసరాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ భౌగోళిక మార్పులను గమనించి విద్యార్థులు, సాధారణ పాస్ దారులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో బస్ పాస్ సెంటర్ వద్దకు వెళ్లి సేవలు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. Uploaded Video:

*🚍కోట, వాకాడు, చిట్టమూరు మండలాల విద్యార్థులు, సీజన్ పాస్ దారుల కోసం ప్రత్యేక సమాచారం*

*🚍మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసరా ప్రాంతంలోనే బస్సు పాసుల జారీ*

*🚍ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రత్యేక బస్ పాస్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి*

*🚍జిల్లాల విభజనతో కోట బస్టాండ్ నెల్లూరు జిల్లాకు, వాకాడు డిపో తిరుపతి జిల్లాకు మారడం వల్లే ఈ నిర్ణయం*

*🚍విద్యార్థులు, ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో పరిసర బస్సు పాస్ కౌంటర్ కి వెళ్లి పాసులు పొందాలి*

*———————*
*✍🏽మునిరాజ్ 👇🏽*
*జర్నలిస్ట్*
*———————-*

కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన విద్యార్థులు, సీజన్ పాస్ దారులకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కీలక సమాచారం అందించారు. ఈ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రయాణికులు ఇకపై బస్సు పాసుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంగళవారం నుంచి వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే పాసుల జారీ ప్రక్రియను చేపట్టనున్నట్లు వాకాడు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ పాస్ కేంద్రం వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, పాస్ దారులు నేరుగా అక్కడికి చేరుకుని తమ పాసులను పొందవచ్చని వారు కోరారు.

*🚍జిల్లాల పునర్విభజన కారణం: వాకాడు డిపో పరిసర ప్రాంతంలోనే బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు*

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా ఆర్టీసీ డిపోల పరిధిలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా కోట ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్లడంతో పాటు, గూడూరు డిపో పరిధిలో విలీనమైంది. మరోవైపు, వాకాడు డిపో తిరుపతి జిల్లా పరిధిలో కొనసాగుతోంది. పరిపాలనాపరమైన ఈ మార్పుల దృష్ట్యా, తిరుపతి జిల్లా పరిధిలోని ప్రజల సౌకర్యార్థం బస్సు పాస్ కౌంటర్‌ను వాకాడు డిపో పరిసరాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ భౌగోళిక మార్పులను గమనించి విద్యార్థులు, సాధారణ పాస్ దారులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నేరుగా వాకాడు డిపో బస్ పాస్ సెంటర్ వద్దకు వెళ్లి సేవలు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.