Thursday, 13 August 2026
  • Home  
  • కొత్తగూడెం డీపీఆర్‌ టెండర్‌ రద్దు
- BHADRADRI

కొత్తగూడెం డీపీఆర్‌ టెండర్‌ రద్దు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): కొత్తగూడెం కార్పొరేషన్‌లో ప్రపంచ బ్యాంకు రుణం కోసం డీపీఆర్‌ తయారీకి పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీపీఆర్‌ తయారీ కోసం పిలిచిన టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్పొరేషన్‌ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి):

కొత్తగూడెం కార్పొరేషన్‌లో ప్రపంచ బ్యాంకు రుణం కోసం డీపీఆర్‌ తయారీకి పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీపీఆర్‌ తయారీ కోసం పిలిచిన టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్పొరేషన్‌ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.