Friday, 4 September 2026
  • Home  
  • కేసీ కెనాల్ గేట్లు ఎత్తి గ్రామాల దాహార్తి తీర్చిన ఎన్ఎండి ఫిరోజ్
- నంద్యాల

కేసీ కెనాల్ గేట్లు ఎత్తి గ్రామాల దాహార్తి తీర్చిన ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల : మిట్నాల, పాండురంగాపురం, ఏ.శివరాంపురం మరియు బి.శివరాంపురం గ్రామాల ప్రజల తాగునీటి ఎద్దడిని నివారించేందుకు పొన్నాపురం వద్ద కేసీ కెనాల్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి ఈ నీటిని విడుదల చేయించారు.ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ.. పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న విషయం తెలుసుకుని తక్షణమే స్పందించి నీటి విడుదల దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చి, ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యను తీర్చినందుకు ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఎన్ఎండి ఫిరోజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం నాగ రాజేశ్వర్ రెడ్డి, శీలం నాగ ప్రదీప్ కుమార్ రెడ్డి, శీలం నాగమహేశ్వర్ రెడ్డి, శీలం నాగ సుబ్బారెడ్డి, శీలం నాగ శేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.