*కారంపూడి ఎస్సై గా ఏం.వాసు నియామకం….*
*ఎస్సై వాసు పై మరికొందరు చేసిన ఆరోపణలు తప్పు అని కొట్టు వేసిన ఉన్నత పోలీస్ అధికారులు*
పున్నమి ప్రతినిధి ఆగస్టు: 19
కారంపూడి మండలంలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ అనంతరం కారంపూడి ఎస్సై వాసుపై విధించిన సస్పెన్షన్‌ను ఉన్నతాధికారులు ఎత్తివేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే మళ్లీ యధావిధిగా కారంపూడి స్టేషన్ కు ఎస్ఐను వాసును నియమించారు. మిర్చి వ్యాపారంలో ఆర్థిక నష్టం ఎదుర్కొన్న ఓ వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించిన నేపథ్యంలో తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ అతని భార్య పురుగుమందు తాగిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై వాసును సస్పెండ్ చేశారు. తాజాగా మంగళవారం కారంపూడి పోలీస్ స్టేషన్ కి ఎస్ఐగా నియమిస్తూ పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించరున్నారు. ఇప్పటివరకు కారంపూడి మండలంలో ఎస్ఐ వాసు పై చేసిన తప్పుడు ఆరోపణలన్నీ పోలీసు అధికారులు గుర్తించారు. నిజమైన మిర్చి రైతులకు న్యాయం చేస్తామని పోలీస్ ఉన్న అధికారులు తెలిపారు. కారంపూడి స్టేషన్ కు ఎస్ఐ వాసులు నియమించడం పై రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



