లస్మయ్య కుటుంబానికి అండగా మున్నూరు కాపు సంఘం.
దహేగాం మండలం కొత్తమీర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులస్తుడు సిద్ధం లస్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం పటేల్స్ జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్, బుధవారం రోజున లస్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లస్మయ్య భార్యకు 50 కిలోల రైస్ బ్యాగ్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి పటేల్, పార్వతి సురేష్, సాయిదామ్ అశోక్, బొడ్డు జలపాతి, అల్లి బాబాజీ, తదితరులు పాల్గొన్నారు.

