Wednesday, 12 August 2026
  • Home  
  • పోలీసులపై దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రం-శ్రీకాళహస్తిలో నిందితుడి వీధి ఊరేగింపు
- తిరుపతి

పోలీసులపై దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రం-శ్రీకాళహస్తిలో నిందితుడి వీధి ఊరేగింపు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో నిన్నటి దినం హెడ్ కానిస్టేబుల్‌పై గంజాయి మూకలు జరిపిన దాడి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువైతే, ఇక సామాన్య ప్రజల భద్రత పరిస్థితి ఏమిటంటూ పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలైన వారిపై, గంజాయి సరఫరా చేసే ముఠాలపై తక్షణమే పోలీసులు జల్లెడ పట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు గంజాయి ముఠా ఆగడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీసులపైనే దాడులకు దిగితే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో హెచ్చరిస్తూ, పట్టుబడిన నిందితుడిని పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో పోలీసులు తమదైన శైలిలో ఊరేగించారు. ఈ చర్యతో నేరగాళ్లకు గట్టి ముందస్తు హెచ్చరికలు పంపినట్లయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.