Wednesday, 12 August 2026
  • Home  
  • సృజనాత్మక ఆలోచనలతోనే దేశ వైజ్ఞానిక అభివృద్ధి-డీవైఈఓ మహేశ్వరరావు
- తిరుపతి

సృజనాత్మక ఆలోచనలతోనే దేశ వైజ్ఞానిక అభివృద్ధి-డీవైఈఓ మహేశ్వరరావు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): విద్యార్థులను శాస్త్రీయ పరిశోధనల వైపు ప్రోత్సహించడానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, దేశ వైజ్ఞానిక అభివృద్ధి ఎల్లప్పుడూ సృజనాత్మక బాలల ఆలోచనల నుండి మొదలవుతుందని పుత్తూరు డీవైఈఓ మహేశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఎన్‌సీఎస్‌సీ (NCSC) ఒక్కరోజు శిక్షణా తరగతులను బుధవారం నాడు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో పరిశోధన గూర్చిన ఆసక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ ప్రాధాన్యత కలిగిన సదస్సులో శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఏపీకోస్ట్ జిల్లా కోఆర్డినేటర్ కేడీ సారధి, అకడమిక్ సైన్స్ కోఆర్డినేటర్ ఎస్. కోదండపాణి, రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ ఎన్. సుబ్రమణ్య శర్మ, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. వీరితో పాటు పుత్తూరు డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లోని అన్ని పాఠశాలలు ఈనెల 15వ తేదీ లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థుల ప్రాజెక్ట్ అభివృద్ధికి రెండు నెలల సమయం ఉంటుందని, నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే అనేక సామాజిక, పర్యావరణ సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించే దిశగా సరికొత్త ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం వహించి ఈసారి తిరుపతి జిల్లాను జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని వక్తలు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.