Sunday, 28 June 2026
  • Home  
  • కంచినపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం.. 13 మందికి శుక్లాలు గుర్తింపు
- తిరుపతి

కంచినపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం.. 13 మందికి శుక్లాలు గుర్తింపు

శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండలం కంచినపల్లి గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో శనివారం త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్, శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్థులు విశేష స్పందన కనబరిచారు. శిబిరంలో మొత్తం 31 మంది రోగులకు నేత్ర వైద్యులు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి కోఆర్డినేటర్ దొరస్వామి తెలిపారు. పరీక్షల అనంతరం 13 మందికి కంటి శుక్లాలు (క్యాటరాక్ట్), మరో ఒకరికి రెక్క మాంసం (టెర్రిజియమ్) సమస్య ఉన్నట్లు గుర్తించి, తదుపరి చికిత్స కోసం అవసరమైన సూచనలు అందించినట్లు వెల్లడించారు. అలాగే శిబిరానికి హాజరైన రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేసి, కంటి ఆరోగ్య పరిరక్షణపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో ఆసుపత్రి సిబ్బంది దామోదర్, లలితతో పాటు గ్రామస్తులు తులసి కుమార్, వెంకటేష్ విశేషంగా కృషి చేసినట్లు దొరస్వామి తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.