Sunday, 27 September 2026
  • Home  
  • ఏళ్ల నిరీక్షణకు తెర… చేతికి పట్టా… ఇంటికి భరోసా…..బొడ్డపాలెం బీసీ కాలనీలో ఆనందం… ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు
- విశాఖపట్నం

ఏళ్ల నిరీక్షణకు తెర… చేతికి పట్టా… ఇంటికి భరోసా…..బొడ్డపాలెం బీసీ కాలనీలో ఆనందం… ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, సెప్టెంబర్ 25 (పున్నమి ప్రతినిధి): ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలోని బొడ్డపాలెం బీసీ కాలనీ వాసుల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జీఓ నంబర్ 30 ప్రకారం 29 మంది అర్హులకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు కావడంతో కాలనీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి కాలనీవాసులు, సాయిరాం సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసిన కాలనీవాసులు, ముందుగా తమకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కాలనీలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మిగిలిన 20 మందికీ పట్టాలు ఇవ్వాలి: కాలనీలో ఇంకా పట్టాలు రావాల్సి ఉన్న 20 మంది అర్హులకు కూడా త్వరితగతిన ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. అలాగే కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కూడా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూల స్పందన: కాలనీవాసుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగిలిన 20 మంది అర్హులకు కూడా త్వరలోనే పట్టాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులకు ఘన సన్మానం: కాలనీ సమస్యల పరిష్కారంలో అండగా నిలిచిన భీమిలి నియోజకవర్గ సీనియర్ నాయకులు చిక్కాల విజయబాబు, ఆనందపురం మాజీ మండల అధ్యక్షులు కాకర వెంకటరమణ, వెల్లంకి మాజీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణ్, సాడి ముత్యాలురెడ్డిలను సాయిరాం సేవా సంఘం, కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొమ్ము రాజు, యువ నాయకులు కాకర సురేష్ కుమార్, సాయిరాం సేవా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి గంగాధర్, సంఘ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, సెప్టెంబర్ 25 (పున్నమి ప్రతినిధి):
ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలోని బొడ్డపాలెం బీసీ కాలనీ వాసుల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జీఓ నంబర్ 30 ప్రకారం 29 మంది అర్హులకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు కావడంతో కాలనీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి కాలనీవాసులు, సాయిరాం సేవా సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసిన కాలనీవాసులు, ముందుగా తమకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కాలనీలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

మిగిలిన 20 మందికీ పట్టాలు ఇవ్వాలి:
కాలనీలో ఇంకా పట్టాలు రావాల్సి ఉన్న 20 మంది అర్హులకు కూడా త్వరితగతిన ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు మంజూరు చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. అలాగే కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కూడా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే సానుకూల స్పందన:
కాలనీవాసుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగిలిన 20 మంది అర్హులకు కూడా త్వరలోనే పట్టాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

సీనియర్ నాయకులకు ఘన సన్మానం:
కాలనీ సమస్యల పరిష్కారంలో అండగా నిలిచిన భీమిలి నియోజకవర్గ సీనియర్ నాయకులు చిక్కాల విజయబాబు, ఆనందపురం మాజీ మండల అధ్యక్షులు కాకర వెంకటరమణ, వెల్లంకి మాజీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణ్, సాడి ముత్యాలురెడ్డిలను సాయిరాం సేవా సంఘం, కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కొమ్ము రాజు, యువ నాయకులు కాకర సురేష్ కుమార్, సాయిరాం సేవా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి గంగాధర్, సంఘ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.