యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.
గ్రామ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు.
ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.

ఏటికొప్పాకలో గ్రామసభ.. సమస్యల పరిష్కారంపై చర్చ….!
యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.

