Sunday, 21 June 2026
  • Home  
  • ఏటికొప్పాక రైతుల సమస్యలు ఢిల్లీ దాకా.. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎంపీ సీఎం రమేష్‌కు వినతి ….!
- అనకాపల్లి

ఏటికొప్పాక రైతుల సమస్యలు ఢిల్లీ దాకా.. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎంపీ సీఎం రమేష్‌కు వినతి ….!

అనకాపల్లి జిల్లా, జూన్ 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా పాలన సందర్భంగా నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమంలో ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏటికొప్పాక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు ప్రస్తావించారు. ప్రత్యేకంగా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ఎంపీ సీఎం రమేష్‌తో పాటు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, రైతుల ఆందోళనలను వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు నగిరెడ్డి సత్యనారాయణ, ఎలమంచిలి రూరల్ ప్రచార కార్యదర్శి ధార నూకరాజు, జిల్లా ఆర్టిజన్ సెల్ నాయకులు మొల్లేటి ప్రసాద్, రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. Uploaded Video:

అనకాపల్లి జిల్లా, జూన్ 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా పాలన సందర్భంగా నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమంలో ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏటికొప్పాక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు ప్రస్తావించారు.

ప్రత్యేకంగా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ఎంపీ సీఎం రమేష్‌తో పాటు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, రైతుల ఆందోళనలను వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు నగిరెడ్డి సత్యనారాయణ, ఎలమంచిలి రూరల్ ప్రచార కార్యదర్శి ధార నూకరాజు, జిల్లా ఆర్టిజన్ సెల్ నాయకులు మొల్లేటి ప్రసాద్, రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.