Monday, 24 August 2026
  • Home  
  • ఎల్నినో ప్రభావం.. పంటలపై అప్రమత్తం :తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి. రమ్య
- జనగాం

ఎల్నినో ప్రభావం.. పంటలపై అప్రమత్తం :తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి. రమ్య

ఎల్నినో ప్రభావం …. పంటల పై అప్రమత్తం —————————————————— జనగామ,ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై ఆగష్టు మాసాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. జనగామ జిల్లా లో ఇప్పటివరకు 247 .4 మీ. మీ. వర్షం కురవగా ఇది సాధారణ వర్షపాతం కన్నా 43.2 శాతం తక్కువగా నమోదయింది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలలో తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు మరియు చీడపీడల సకాలంలో నివారణ చర్యలు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం–జనగామ కోఆర్డినేటర్ డా. వి. రమ్య సూచించారు. వరి లో ఎక్కడైతే నార్లు పోయలేదో ఆగష్టు మాసంలో వెదజల్లే లేదా డ్రంసీడర్ పద్ధతి లో విధ్హుకోవడం మంచిది. వారి నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యమయ్యే కొద్దీ రకాలను బట్టి దిగుబడి తగ్గడమే కాకుండా చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ముదురు నారు నాటాల్సి పరిస్థితులలో మొక్కల మధ్య దూరం తగ్గించుకొని దగ్గర దగ్గరగా నాట్లు వేసుకుంటే దిగుబడి పై ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రధాన పొలం లో కలుపు మొక్కల నివారణకు ఎకరానికి 4 కిలోల బెన్సుల్ఫ్యూరం బెన్సుల్ఫ్యూరాన్ మిథైల్ 0.6 % జి ఆర్ + ప్రేతిలాక్లోర్ + సైఫనర్ మందును 600- 800 మీ. లీ నాటిన 3-5 రోజులలోపు పిచికారీ చేయాలి. వర్షాధారం మీద ఆధారపడి మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే నీటి కొరత వలన ఆకులు ముడుచుకొని సన్నగా అవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం వంటివి గమనించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు సరైన సమయం లో నీరు పెట్టుకోవాలి లేదా నీటి ఎద్దడి ఉంటే యూరియా 2 % ద్రావణాన్ని పంటపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితిని కొంతవరకు తట్టుకోవచ్చు. వర్షాభావ పరిస్థితుల అనంతరం వచ్చిన వర్షాలకు ఎకరా కు 25 కిలోల యూరియా ని అదంగంగా వేసుకుంటే దిగుబడి పెంచవచ్చు. కత్తెర పురుగు నివారణకు 10- 12 రోజుల పీరు పై వేప సంబంధిత మందు అజాధిరాక్టిన్ (1500 పిపియం) 5 మీ. లీ లేదా ఇమామెకిటిన్ బెంజోయట్ 0.4 గ్రా. లేదా క్లొరాన్ట్రేనీలిప్రోల్ 0.4 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధ్యమయినంత వరకు మందు ద్రావణం మొక్కసుడిలో పడేలాగా పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు, కత్తెర పురుగును గమనించిన వెంటనే పొడి ఇసుకను, సున్నంను (9 పాళ్ళు ఇసుక + 1 పాళ్ళు సున్నం) కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకొన్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. పంటలో అంతర కృషి జరిపి ఎకరాకు 50 కిలో ల యూరియా ను పై పాటుగా వేసుకొని మట్టిని మొక్కల వేర్లకు ఎదగదోయవలెను. కంది పంట ప్రస్తుతం 20 నుండి 40 రోజుల దశలో ఉంది. తొలి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అంతరకృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా తాయారు చేసినచో భూమిలో తేమ బాగా నిలిచి బెట్టాను కొంతవరకు తట్టుకోగలదు. అంతరకృషి సాధ్యం కానీ పరిస్థితులలో కలుపు నివారణకు విత్తింక 20 రోజులకు ఇమాజితపైర్ 300 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినచో గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. బెట్ట పరిస్థితులలో రసంపీల్చే పురుగులు ముఖ్యనగ పేనుబంక ఆశించి మొక్కలు రాలిపోతాయి. Kaavuna 20 గ్రా. యూరియా ద్రావణం లేదా 10 గ్రా. మల్టీ-కే లేదా పాలీఫీడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను. పెసర, మినుములో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు తేమను కాపాడుకోడానికి కలుపు మొక్కల నివారణకు అంతర కృషి చేసుకోవాలి. మొగ్గ పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినచో 0.5 % పొటాషియం నైట్రేట్ (5 గ్రా. లీటరు నీటికి) లేదా 0.5 % 19 :19 :19 (5 గ్రా. లీటరు నీటికి) ఆకుల పై పిచికారీ చేయాలి. ఆకు ముడుత వైరస్ ను వ్యాపింపచేసే తామర పురుగుల నివారణకు అసిఫాట్ 1గ్రా లేదా ఫిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు ఒక లీటరు నీటికి 0 .2 గ్రా. అసిటామిప్రిడ్ లేదా 1 .25 గ్రా. డైఫెన్తయురాన్ కలిపి పిచికారీ చేయాలి. పూతలో మారుకా ఆకు ముడుత పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0 .2 మి.లీ. మందును పిచికారీ చేసుకోవచ్చు. అవసరమయితే వారం రోజుల తరువాత మరల పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతులంతా అప్రమత్తంగా ఉండి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖా సూచనల మేరకు సమర్థవంతమయిన యాజమాన్య పద్ధతులతో ముందస్తు జాగ్రత్తలు చేపడితే పంటల నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవాకాశం ఉందని డా. వి. రమ్య తెలిపారు.

ఎల్నినో ప్రభావం …. పంటల పై అప్రమత్తం
——————————————————
జనగామ,ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై ఆగష్టు మాసాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. జనగామ జిల్లా లో ఇప్పటివరకు 247 .4 మీ. మీ. వర్షం కురవగా ఇది సాధారణ వర్షపాతం కన్నా 43.2 శాతం తక్కువగా నమోదయింది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలలో తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు మరియు చీడపీడల సకాలంలో నివారణ చర్యలు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం–జనగామ కోఆర్డినేటర్ డా. వి. రమ్య సూచించారు. వరి లో ఎక్కడైతే నార్లు పోయలేదో ఆగష్టు మాసంలో వెదజల్లే లేదా డ్రంసీడర్ పద్ధతి లో విధ్హుకోవడం మంచిది. వారి నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యమయ్యే కొద్దీ రకాలను బట్టి దిగుబడి తగ్గడమే కాకుండా చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ముదురు నారు నాటాల్సి పరిస్థితులలో మొక్కల మధ్య దూరం తగ్గించుకొని దగ్గర దగ్గరగా నాట్లు వేసుకుంటే దిగుబడి పై ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రధాన పొలం లో కలుపు మొక్కల నివారణకు ఎకరానికి 4 కిలోల బెన్సుల్ఫ్యూరం బెన్సుల్ఫ్యూరాన్ మిథైల్ 0.6 % జి ఆర్ + ప్రేతిలాక్లోర్ + సైఫనర్ మందును 600- 800 మీ. లీ నాటిన 3-5 రోజులలోపు పిచికారీ చేయాలి.
వర్షాధారం మీద ఆధారపడి మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే నీటి కొరత వలన ఆకులు ముడుచుకొని సన్నగా అవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం వంటివి గమనించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు సరైన సమయం లో నీరు పెట్టుకోవాలి లేదా నీటి ఎద్దడి ఉంటే యూరియా 2 % ద్రావణాన్ని పంటపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితిని కొంతవరకు తట్టుకోవచ్చు. వర్షాభావ పరిస్థితుల అనంతరం వచ్చిన వర్షాలకు ఎకరా కు 25 కిలోల యూరియా ని అదంగంగా వేసుకుంటే దిగుబడి పెంచవచ్చు. కత్తెర పురుగు నివారణకు 10- 12 రోజుల పీరు పై వేప సంబంధిత మందు అజాధిరాక్టిన్ (1500 పిపియం) 5 మీ. లీ లేదా ఇమామెకిటిన్ బెంజోయట్ 0.4 గ్రా. లేదా క్లొరాన్ట్రేనీలిప్రోల్ 0.4 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధ్యమయినంత వరకు మందు ద్రావణం మొక్కసుడిలో పడేలాగా పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు, కత్తెర పురుగును గమనించిన వెంటనే పొడి ఇసుకను, సున్నంను (9 పాళ్ళు ఇసుక + 1 పాళ్ళు సున్నం) కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకొన్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. పంటలో అంతర కృషి జరిపి ఎకరాకు 50 కిలో ల యూరియా ను పై పాటుగా వేసుకొని మట్టిని మొక్కల వేర్లకు ఎదగదోయవలెను.
కంది పంట ప్రస్తుతం 20 నుండి 40 రోజుల దశలో ఉంది. తొలి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అంతరకృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా తాయారు చేసినచో భూమిలో తేమ బాగా నిలిచి బెట్టాను కొంతవరకు తట్టుకోగలదు. అంతరకృషి సాధ్యం కానీ పరిస్థితులలో కలుపు నివారణకు విత్తింక 20 రోజులకు ఇమాజితపైర్ 300 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినచో గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. బెట్ట పరిస్థితులలో రసంపీల్చే పురుగులు ముఖ్యనగ పేనుబంక ఆశించి మొక్కలు రాలిపోతాయి. Kaavuna 20 గ్రా. యూరియా ద్రావణం లేదా 10 గ్రా. మల్టీ-కే లేదా పాలీఫీడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను. పెసర, మినుములో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు తేమను కాపాడుకోడానికి కలుపు మొక్కల నివారణకు అంతర కృషి చేసుకోవాలి. మొగ్గ పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినచో 0.5 % పొటాషియం నైట్రేట్ (5 గ్రా. లీటరు నీటికి) లేదా 0.5 % 19 :19 :19 (5 గ్రా. లీటరు నీటికి) ఆకుల పై పిచికారీ చేయాలి. ఆకు ముడుత వైరస్ ను వ్యాపింపచేసే తామర పురుగుల నివారణకు అసిఫాట్ 1గ్రా లేదా ఫిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు ఒక లీటరు నీటికి 0 .2 గ్రా. అసిటామిప్రిడ్ లేదా 1 .25 గ్రా. డైఫెన్తయురాన్ కలిపి పిచికారీ చేయాలి. పూతలో మారుకా ఆకు ముడుత పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0 .2 మి.లీ. మందును పిచికారీ చేసుకోవచ్చు. అవసరమయితే వారం రోజుల తరువాత మరల పిచికారీ చేయాలి.
ఈ విధంగా రైతులంతా అప్రమత్తంగా ఉండి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖా సూచనల మేరకు సమర్థవంతమయిన యాజమాన్య పద్ధతులతో ముందస్తు జాగ్రత్తలు చేపడితే పంటల నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవాకాశం ఉందని డా. వి. రమ్య తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.