Sunday, 6 September 2026
  • Home  
  • ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన పడిగల సాయి నందినికి బీజేపీ ఘన సన్మానం.
- ఖమ్మం

ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన పడిగల సాయి నందినికి బీజేపీ ఘన సన్మానం.

పెనుబల్లి / ఖమ్మం ఇటీవల విడుదలైన ఎంబీబీఎస్ ఫలితాల్లో ఉచిత సీటు సాధించిన పెనుబల్లి మండలం మండలంపాడు గ్రామానికి చెందిన బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ రావు లక్ష్మి దంపతుల కుమార్తె సాయి నందినిని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరపున ఘనంగా సన్మానించారు. బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగసురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్ర నర్సింహారావు, వేంసూరు మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ, మైనార్టీ మోర్చా నాయకులు షేక్ రహమతుల్లా, సీనియర్ నాయకులు దొడ్డపనేని కృష్ణయ్య, పెనుబల్లి మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి నందినిని శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించి అభినందించారు. నందిని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాల నాగసురేంద్ర రెడ్డి ఆకాంక్షించారు.

పెనుబల్లి / ఖమ్మం

ఇటీవల విడుదలైన ఎంబీబీఎస్ ఫలితాల్లో ఉచిత సీటు సాధించిన పెనుబల్లి మండలం మండలంపాడు గ్రామానికి చెందిన బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ రావు లక్ష్మి దంపతుల కుమార్తె సాయి నందినిని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరపున ఘనంగా సన్మానించారు. బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగసురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్ర నర్సింహారావు, వేంసూరు మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ, మైనార్టీ మోర్చా నాయకులు షేక్ రహమతుల్లా, సీనియర్ నాయకులు దొడ్డపనేని కృష్ణయ్య, పెనుబల్లి మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి నందినిని శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించి అభినందించారు. నందిని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాల నాగసురేంద్ర రెడ్డి ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.