*అధికారికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన కారంపూడి లోని ఓ ప్రైవేట్ పాఠశాల రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వ
*ప్రవేట్ పాఠశాలలపై మండల స్థాయి అధికారికి ప్రేమ ఎందుకు ఎక్కువ*
*కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి*
వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కారంపూడి మండలంలో మాత్రం శుక్రవారం రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రవేట్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఎంఈఓ అనుమతులతో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ ప్రెవేట్ పాఠశాలకు మాత్రం సెలవు ప్రకటించలేదు. నారా లోకేష్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూయించి.. విద్యార్థులకు ఇబ్బందులు కలక్కుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే మాత్రం.. కారంపూడి లో మాత్రం ప్రవేట్ పాఠశాలు మాకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్టానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఈఓ నిర్లక్ష్యంగానే ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్టు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.


