Monday, 27 April 2026
  • Home  
  • ఊరందూరులో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం – ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం
- తిరుపతి

ఊరందూరులో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం – ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి టెంపుల్ న్యూస్( : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపింది. ఈ సందర్భంగా ఆలయ పరిపాలన అధికారి బి.కే. వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిశితా రెడ్డి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించగా, గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను వీక్షించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవాలు విజయవంతంగా కొనసాగేందుకు గ్రామస్థులు సహకారం అందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.