*తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో “టీ కొట్టు ముచ్చట్లు” కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ గారు ఆలూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులను పలకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఆలూరు గ్రామం అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక చెరువును సందర్శించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులను కోరారు. అనంతరం గ్రామంలో పలువురిని పలకరించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కెవి రమణ, రజనీష్ కిరాడ్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.*



